రాజీనామా చేసి రండి: కాంగ్రెస్‌కు వైయస్ వివేకా సవాల్

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను విన్నవారు ఆయనను చీదరించుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే, విప్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో అన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మొదట డిమాండ్ చేసిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారన్నారు. మంత్రి కాకముందు ఆనం ఆస్తులెంత? ఇప్పుడు వారి ఆస్తులెంతో తేల్చాలన్నారు. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన రచ్చ రచ్చగా మారిందన్నారు.
దీంతో తన పదవి ఊడుతుందేమోననే భయంతో ఆనం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కిరణ్ పర్యటన రచ్చను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్‌గా తీసుకుంటే కిరణ్ ముఖ్యమంత్రి పదవికి ఎసరు రావడం ఖాయమన్నారు. ఒకవేళ అదే జరిగితే ముఖ్య పదవి దక్కించుకోవాలని ఆశతో సోనియా వద్ద మార్కులు కొట్టేయడానికి వైయస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండదండలతో పదవులను పొంది, ఆయన కుటుంబం తప్పితే రాష్ట్రానికి మరో దిక్కులేదని చెప్పిన ఆనం సోదరులు ఇప్పుడు అదే కుటుంబంపై విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు అని అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్లు కష్టపడి కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్ ఒక దినపత్రిక, ఛానల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, కేవలం రెండేళ్లలోనే రెండు టీవి ఛానళ్లు, ఒక పత్రిక ఏర్పాటు చేసిన కిరణ్ ఇంకెంత అవినీతికి పాల్పడ్డారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications