సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ: సోనియాతో ఆజాద్ భేటీ

Ghulam Nabi Azad-Sonia Gandhi-Sabitha Indra Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో నిందితురాలిగా ఉన్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి భవిష్యత్తు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల్లోకి వెళ్లింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్చ్ గులాంనబీ అజాద్ సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సబితకు శాఖ మార్చడమా లేదా అన్న దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా చర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డిపై నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఎఐసిసి వర్గాలు భావిస్తున్నాయి.

సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర కళంకిత మంత్రులపై కూడా ఏం చేయాలనే విషయంపై సోనియా గాంధీ కచ్చితమైన నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18వ తేదీన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వస్తున్న సందర్భంగా వారితో కూడా చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సబితా ఇంద్రారెడ్డికి ఇతర మంత్రులు బాసటగా నిలుస్తున్నారు. దానికితోడు, రాజీనామా చేయాలనే సబితా ఇంద్రారెడ్డి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తే, ధర్మాన ప్రసాదరావు వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో పాటు మిగతా మంత్రుల చేత కూడా రాజీనామాలు చేయించాల్సి వస్తుందని, ఇది తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+