వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లోని జగన్‌కే అంతుంటే బాబుకెంతుండాలి!?: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
విశాఖపట్నం: అక్రమాస్తుల కేసులో అరెస్టై హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే అంత పొగరు, అహంకారం ఉంటే.. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకెంత గర్వంగా భావించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కవిత అన్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వస్తారని ఆమె జోస్యం చెప్పారు.

కాగా, తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రానిపక్షంలో తాను ఇక ఇక్కడుండనని తెలుగుదేశం పార్టీ నేత కవిత నెల రోజుల క్రితం ప్రతినబూనిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆమె అప్పుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే, అలా జరగని పక్షంలో తాను ఇక ఇక్కడుండే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఆమె చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు.

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించే కంటే ముందు తెలంగాణలో, సీమాంధ్రలో టిడిపి పరిస్థితి దారుణంగా కనిపించింది. దీనిపై టిడిపిలోనే నిరాసక్తత కనిపించింది. ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లింది. అయితే, బాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ, సీమాంధ్రలో టిడిపి బాగా పుంజుకుంది. అదే సమయంలో కార్యకర్తల్లోను ఉత్సాహం కనిపిస్తోంది.

English summary
TDP leader Kavitha has lashed out at YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy and praised TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X