సాయిని 3గంటలు విచారించిన ఈడి: అక్బర్‌కు వారెంట్

జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఏ ప్రాతిపదికన పెట్టారనే తదితర అంశాలపై అడిగారని తెలుస్తోంది. విజయ సాయిని మూడు గంటల పాటు విచారించన ఈడిఅధికారులు మే 2వ తేదిన మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. విచారణ ముగిసిన అనంతరం వివరాలను వెల్లడించేందుకు సాయి నిరాకరించారు.
మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అధికారులు హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో సిబిఐ ఎదుట ఈ రోజు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వివరాలను అధికారుల నుండి సిబిఐ సేకరించింది.
జగన్ కేసు వేగవంతం
జగన్ ఆస్తుల కేసు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ఆరు అంశాలపై సిబిఐ ఛార్జీషీట్లు దాఖలు చేయనుంది. ఇందుకు అనుగుణంగా వేర్వేరు విభాగాల నుండి సమాచారాన్ని సేకరిస్తోంది. జగన్‌తో పాటు జగన్ కంపెనీలు దాఖలు చేసిన ఐటి రిటర్న్స్, పన్ను చెల్లింపు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్ల ప్రతులను సిబిఐకి అందజేసినట్లుగా తెలుస్తోంది.
అక్బర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసికి రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ కేసులో విచారణను కోర్టు మే 8వ తేదికి వాయిదా వేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టుకు అక్బర్ హాజరు కాలేదు.
సంజయ్ దత్ పిటిషన్ పైన విచారణ వాయిదా
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన లొంగుబాటుకు గడువు కావాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ పైన విచారణను రేపటికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications