హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులో జప్తుపై తీర్పు రిజర్వ్: బీవీకి బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-BV Srinivas Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో రెండో విడత ఆస్తుల జప్తుపై విచారణ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ముగిశాయి. తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వ్ చేసింది. రాంకీ, జగతి సంస్థల ఆస్తుల జప్తునకు సంబంధించి న్యాయప్రాధికార సంస్థలో వాదనలు జరిగాయి.

చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. చెప్పాల్సిన అంశాలను ఈ నెల 30వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని సంస్థ రాంకీ, జగతి సంస్థలను కూడా ఆదేశించింది.

కర్ణాటక మాజీ మంత్రి బీవి శ్రీనివాస రెడ్డికి కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఎస్కార్టుతో కూడిన బెయిల్‌ను శ్రీనివాస రెడ్డికి మంజూరు చేసింది. బళ్లారిలో ఉన్నతన అమ్మమ్మను చూడడానికి అనుమతించాలని బీవీ శ్రీనివాస రెడ్డి కోర్టును కోరారు. శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని కోర్టు సిబిఐకి సూచించింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. ఓఎంసిలోఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఆయన సమీప బంధువు కూడా.

English summary
The decision on property attachment in YSR Congress party president YS Jagan case reserved by the adjucatory authority. Meanwhile, BV Srinivas Reddy, accused in OMC case has been sanctioned interim bail by the CBI court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X