టెక్సాస్ కర్మాగారంలో భారీ పేలుడు: 60 మంది మృతి

పేలుడుకు ఓ నర్సింగ్ హోం ధ్వంసమైంది. దాని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాని పక్కన గల అపార్టుమెంటులో పలువురు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ఆ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పలువురు గాయపడినట్లు వాకో ట్రిబ్యూన్ న్యూస్ పేపర్ తెలిపింది.
ఎరువువ కర్మాగారంలోని అమ్మోనియం నైట్రెట్ కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ఒకహోమా సిటీ బాంబు లాగా ఉందని ప్రత్యక్ష సాక్షులు వ్యాఖ్యానించినట్లు వాకో ట్రిబ్యూన్ హెరాల్డ్ రాసింది. వెస్ట్ మిడిల్ స్కూల్‌తో పాటు పలు భవనాలకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.
పేలుడుకు గల కారణం తెలియడం లేదు. గాయపడినవారిని స్ట్రెచర్స్, వీల్ చైర్లలో తరలించారు. స్క్వాడ్ కార్లు రంగంలోకి దిగాయి. ఆరు హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల కోసం వాడుతున్నారు. అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications