చంద్రబాబుకు 'డబుల్' కిక్: జగన్ పార్టీలో కలవరం

చంద్రబాబు పాదయాత్రలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టిడిపికి మద్దతు పెరుగుతూ వస్తోంది. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు నిత్యం పల్లె వేశారు. పాదయాత్ర తర్వాత తమ పరిస్థితి చాలా మెరుగు పడిందని చెప్పారు. తెలుగు తమ్ముళ్లలో బాబు పాదయాత్ర ఉత్సాహానికి తోడు ఇటీవల సర్వేలు డబుల్ కిక్ ఇస్తున్నాయనే చెప్పవచ్చు. సి ఓటరు సర్వేతో పాటు సొంత సర్వేలలో టిడిపి పరిస్థితి చాలా మెరుగుపడిందని తేలిందట.
పాదయాత్రకు ముందు ఒకటి రెండు స్థానాలకు మించి పార్లమెంటు స్థానాలు, ఇరవై ముప్పైకి మించి అసెంబ్లీ స్థానాలు గెలవలేని పరిస్థితి ఉండేదని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆపార్టీ 55 నుండి 70 వరకు అసెంబ్లీ, 12 లోకసభ స్థానాల్లో గెలుపొందుతుందని సర్వేలు చెబుతున్నాయట. మరికొద్ది రోజులైతే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ సర్వే బాబులో కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చాయంటున్నారు.
ఇక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఈ సర్వేలు అసంతృప్తిని మిగిల్చాయట. తమకు 230 సీట్లు వస్తాయని జగన్ పార్టీ, వంద సీట్లు ఖాయమని తెరాస చెప్పుకుంటోంది. కానీ ఆ పార్టీకి గతంలో వలె ఆశించిన ఫలితాలు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని సర్వేలు చెప్పడంతో ఆ పార్టీలో కలవరం ప్రారంభమైందట. మరికొద్ది రోజులు ఆగితే మరింత నష్టం జరిగినా జరగవచ్చుననే ఆందోళన వారిలో కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఆ పార్టీలు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications