ఐటం సాంగ్సూ: రేప్‌పై అక్తర్, బిటెక్ విద్యార్థి రేప్ యత్నం

దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన లోకసభలో సుమోటోగా ఈ ప్రకటన చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
యువతిపై చేయి చేసుకున్న అదికారిని కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడు మనోజ్ కుమార్ ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. అత్యాచారాలు కేవలం ఢిల్లీలోనే జరగడం లేదని అంతటా జరుగుతున్నాయని షిండే చెప్పారు.
కర్నూలులో అత్యాచారయత్నం
అత్యాచారాలపై దేశవ్యాప్తంగా అట్టుడుకుతుండగానే మరోవైపు అత్యాచారాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండలో ఐదేళ్ల చిన్నారిపై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారయత్నం చేశాడు. ఎస్సార్ కాలనీలో ఆడుకుంటున్న చిన్నారిపై బిటెక్ పూర్తి చేసిన సదరు విద్యార్థి ఈ రోజు అత్యాచారయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications