'జగన్ ఇంత దుర్మార్గుడా? వైఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేసి'

వైయస్‌కు మంచి సంతానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ మంచివాడనుకున్నామని అందుకే సిఎం కావాలని అందరం కోరుకున్నామని, అందుకోసం సంతకాలు చేశామని కానీ ఆయన ఇలాంటి దుర్మార్గుడని తర్వాత తెలిసిందన్నారు. రక్షణ స్టీల్స్‌కు లక్షా యాభై వేల ఎకరాలు కట్టబెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
నాడు వైయస్ రాజశేఖర రెడ్డితో కెసిఆర్ కుమ్మక్కయ్యారన్నారు. తెలంగాణలో దోపిడీ జరగకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. ఆయనే తెలంగాణ గనులను కాపాడారన్నారు. ముఖ్యమంత్రిని రోజా వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు.
మందకృష్ణపై ఫైర్
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలాగే ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారన్నారు. సిఎం ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తున్నారన్నారు. ఆయన సహకారం వల్లనే దళితుడైన దామోదర రాజనర్సింహకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications