ముంబైలో తేలిన కామారెడ్డి అమ్మాయి, మహిళ పని

అదలా వుంటే, మంగళవారం ఉదయం ముంబైలోని చర్చిగేటు రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కీర్తనను అక్కడి సీఎస్‌టీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తనది కామారెడ్డి అని, గుర్తు తెలియని మహిళ ఇక్కడికి తీసుకొచ్చిందని తెలిపింది. ఆమె వద్ద నుంచి తప్పించుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చినట్టు రోదిస్తూ చెప్పింది.
చివరకు కీర్తన వద్ద సెల్ నెంబర్లు తీసుకున్న చర్చిగేట్ పోలీసులు, ఆమె కుటుంబసభ్యులతో పాటు కామారెడ్డి పోలీసులను సంప్రదించారు. దీంతో ముంబైలో ఉన్న కీర్తనను తీసుకొచ్చేందుకు మంగళవారం సాయంత్రం పోలీసులతో పాటు కుటుంబసభ్యులు బయలుదేరి వెళ్లారు.
కాగా, కీర్తనను ముంబై పోలీసులు కీర్తనను ఓ స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉంచినట్టు తెలిసింది. కీర్తన అదృశ్యం సంఘటన స్థానికంగా తీవ్ర కలవరం సృష్టించింది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications