'పశువుల్లా కొంటున్నారు, వైఎస్ జేబులోని డబ్బులా?'

కాంగ్రెస్ అనే చెట్టు కింద దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎదిగి ముఖ్యమంత్రిగా ఎదిగారన్నారు. అయితే నేడు ఆయన కుమారుడు వైయస్ జగన్ ఆ చెట్టునే కూల్చాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలకోట్లు అవినీతిగా సంపాదించి ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటున్నారని విమర్శించారు.
వైయస్ హయాంలో చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని, వైయస్ జేబులో నుంచి పథకాలు అమలు చేయలేదని చెప్పారు. వైయస్ మరణించినప్పుడు శవం ఇంట్లో ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ సంతకాలు చేపట్టడం దారుణమని, ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కాగా, ఇటీవల కాంగ్రెసు పార్టీ నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన మాటల దాడి పెంచారు. వైయస్‌ను పలువురు నేతలు తప్పు పడుతుండగా కొందరు నేరుగా కాకుండా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి జగన్ దోచుకున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications