జైలుకెళ్లి పార్టీ మారుతున్నారు: జగన్‌పై బొత్స ఫైర్

Botsa Satyanarayana and Kiran Kumar Reddy
నల్లగొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి కార్యక్రమాలు చేసే ముందు గుడికి వెళ్తాంమని, కానీ, ఇప్పుడు కొంతమంది పార్టీ మారేముందు చంచల్‌గూడ జైలుకు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.లక్షల కోట్లు దోచుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకర ధోరణి అని అన్నారు.

కాంగ్రెస్‌కు వ్యక్తులు ముఖ్యం కాదని, ఎవరు ఉన్నా లేకున్నా సంక్షేమ పథకాలు సామాన్యులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారుని, వైయస్ చనిపోయిన తరువాత ఆ పథకం ఎత్తేస్తారని చాలామంది ప్రచారం చేశారని, కానీ తమ ప్రభుత్వం ఇప్పుడు రూపాయికే కిలో బియ్యం అందిస్తోందని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాల ఆరాటం అట్టడుగు వర్గాల కోసం కాదు.. అధికారం కోసమేనని బొత్స వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన బియ్యం పథకాన్ని, 50 హార్స్‌పవర్ వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఎత్తివేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు.

లక్షరూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీలేదంటూ చంద్రబాబు తాజా మహిళా డిక్లరేషన్‌లో ప్రకటించారని, అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తోందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. అధికార దాహంతో అందలం ఎక్కడం కోసం టీడీపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ విమర్శించారు. ప్రతిపక్షాలు కుర్చీ ఎక్కడం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ, అవినీతికి పాల్పపడుతున్నాయని అన్నారు.

ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌ పథకం ఘనత కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీయేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసగించారు.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నిన దళితుల సం క్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ కలలు, అమ్మహస్తం వంటి పథ కాలను అమలు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఆర్ధికంగా లబ్ధి చేకూ ర్చాలనే ఉద్దే శంతో ప్రత్యేక చట్టం రూపొందించామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+