జగన్‌కు మరో షాక్: మెమోను తిరస్కరించిన కోర్టు

ఇరువురి మెమోలను కూడా కోర్టు తిరస్కరించింది. సిబిఐ వాదనలకే కోర్టు మొగ్గు చూపింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంకా ఆరు అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉందని, ఈ ఆరు అంశాలపై కూడా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేస్తామని, ఆరో చార్జిషీట్ తుది చార్జిషీట్ అవుతుందని, ఈ విషయంలో తాము ఎక్కడా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
కాగా, సిబిఐ కోర్టు తీర్పుపై వైయస్ జగన్ హైకోర్టుకు వెళ్తారా, లేదా అనేది తెలియడం లేదు. జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ సమయంలో సిబిఐ కోర్టు తమ మెమోలను తిరస్కరించిన విషయంపై జగన్ తరఫు న్యాయవాదులు ఏమైనా ప్రస్తావిస్తారా అనేది కూడా తెలియడం లేదు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇటీవల సిబిఐ దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇది ఐదో చార్జిషీట్. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ ఈ చార్జిషీట్‌లో నిందితురాలిగా చేర్చింది. దీంతో సబితా ఇంద్రారెడ్డి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించి, విధులకు హాజరు కావడం లేదు.












Click it and Unblock the Notifications