బాబుకు వెండి చెప్పులు: వెంట బాలయ్య, లోకేష్

ఆగనంపూడిలో చంద్రబాబు 60 అడుగుల ఎత్తు గల పైలాన్‌ను ఆవిష్కరించారు. విజయ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అక్కడి నుంచి బహిరంగ సభ జరిగే ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానానికి చేరుకుంటున్నారు.
బహిరంగ సభలో చంద్రబాబు సుమారు గంటసేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఏడు నెలల పాటు ప్రజల మధ్య పర్యటించి తాను గుర్తించిన సమస్యలను, వాటికి పార్టీ తరఫున పరిష్కారాలను వివరిస్తారు.
పకడ్బందీ ఏర్పాటు సుమారుగా 16 ఎకరాల విస్తీర్ణం గల ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు లక్షల మందికి ఆ ప్రాంతం సరిపోతుందని పోలీసుల అంచనా. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభిస్తారు.
సినీ నటుడు ఏవీఎస్, నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, సునీత, నాగూర్‌బాబు తదితరుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సందేశాత్మక గీతాలు, ఎన్టీఆర్ సినిమాల్లోని సామాజిక చైతన్య గీతాలను గాయకులు ఆలపిస్తారు. రాత్రి ఏడుగంటలకల్లా సభను ముగించాలని పార్టీ అగ్రనాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications