సిఎం సభలో పొన్నం జై తెలంగాణ, అడ్డుపడొద్దని వినతి

తెలంగాణ డిమాండ్ ముందు ప్రభుత్వ పథకాలు వెలవెలబోతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా ఎన్ని చేసినా లాభం ఉండదని ఆయన అన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలని ఆయన కోరారు. లేదంటే వరంగల్ జిల్లాలో పెట్టాలని ఆయన కోరారు. కరీంనగర్‌కు వైద్య కళాశాల ఇవ్వాలని ఆయన కోరారు. ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన జై తెలంగాణ, జై కాంగ్రెసు అని నినాదం చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మౌనంగా కూర్చున్నారు. సభకు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు.
పొన్నం ప్రభాకర్ తర్వాత మాట్లాడిన బొత్స సత్యనారాయణ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదు. తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసింది ప్రజా యాత్రనా, దండయాత్రనా అని ఆయన అడిగారు. భావోద్వేగాలతో పుట్టిన పార్టీలు మనుగడ సాగించలేవని ఆయన అన్నారు. అధికార దాహంతోనే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.
కరీంనగర్ జిల్లాతో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన చెప్పారు. వంగర గ్రామానికి చెందిన పివి నర్సింహారావు మంత్రివర్గంలో తన తండ్రి మంత్రిగా పనిచేశారని ఆయన చెప్పారు. ఇతర విషయాలను కూడా ఆయన ఉదహరించారు. ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు అడ్డుకోవడానికి ప్రయత్నించాయని ఆయన విమర్సించారు. రెండు కోట్ల ప్రజల కోసం ఈ చట్టం తెస్తుంటే రెండు రోజులు అసెంబ్లీకి రావడానికి చంద్రబాబుకు తీరిక లేదని ఆయన అన్నారు. నడకే ముఖ్యమని చంద్రబాబు చట్టానికి కాకుండా నడకకే ప్రాముఖ్యం ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications