వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య జై బాబు: ప్రజలే నడిపించారని చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Babu - Balaiah
విశాఖపట్నం: నందమూరి హీరో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జై కొట్టారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు ముగింపు సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆయన శనివారం రాత్రి ప్రసంగించారు. క్లిష్టపరిస్థితిలో చంద్రబాబు పార్టీని కాపాడారని ఆయన అన్నారు. జగన్ జైలు నుంచి ఎప్పుడు వస్తారో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకే తెలియదని, వారికి చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.

నాన్నగారు ఎన్టీ రామారావు విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని ఆయన అన్నారు. 2009లో విద్యుత్‌పై సర్‌చార్జీ వసూలుకు వైయస్ రాజశేఖర రెడ్డే ఆదేశించారని ఆయన అన్నారు. మనందరి నాయకుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో చంద్రబాబు ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారని ఆయన అన్నారు. సామాన్యూలకు కూడు, గుడ్డ, గూడులను అందించిన ఘనత ఎన్టీఆర్‌ది అని బాలకృష్ణ అన్నారు.

తనకు సహకరించిన ప్రజలకు తాను రుణపడి ఉంటానని చంద్రబాబు చెప్పారు. పాదయాత్ర సాధ్యం కాదేమోనని అన్నారని, సాహసం చేస్తున్నారని అన్నారని, అయితే పరిస్థితులను చూసిన తర్వాత ప్రజల్లో ఉండాలని అనుకున్నానని, ప్రజలు కష్టాల్లో ఉంటే తాను హైదరాబాదులో ఉండడం భావ్యం కాదని భావించి పాదయాత్రను ప్రారంభించానని ఆయన చెప్పారు. పాదయాత్ర సందర్భంగా బాధ, నొప్పి ఉండేదని, ప్రజల అభిమానం చూసిన తర్వాత ఆనందిస్తూ ముందుకు సాగానని చంద్రబాబు చెప్పారు. తనను నడిపించింది ప్రజలేనని, ప్రజల ఉత్సాహం వల్లనే ముందుకు సాగగలిగానని ఆయన చెప్పారు.

తాను ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన చెప్పారు. రైతులకు, ఇతర వర్గాలకు తాను అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ఆయన పునరుద్ఘాటించారు. రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, వెనక్కి తగ్దేది లేదని ఆయన చెప్పారు.

కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాష్ట్రానికి ఏమీ చేయలేదని, నీలం తుఫాను బాధితులకు సహాయం చేయలేదని ఆయన అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. సెజ్‌ల పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల భూములను హస్తగతం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. భూస్వాములను, పెత్తందార్లను, నయా జమీందార్లను ఈ ప్రభుత్వం తయారు చేస్తోందని ఆయన అన్నారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆయన అన్నారు. భూములను కారు చౌకగా కొట్టేశారని ఆయన అన్నారు.

నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కొంత మందికి మాత్రమే పరిమితమైందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన చెప్పారు. పాదయాత్రలో తన అనుభవాలను ఆయన వివరించారు. ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని చేపట్టి అన్ని గ్రామాలకు నీరు అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సమస్యలను ఆయన ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు.

తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 2009 ఎన్నికల్లో తెరాసతో పొత్తు వల్లనే తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఈ భూమిపై లక్ష కోట్లు సంపాదించిన అవినీతి పరుడు జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

తమ పార్టీ పేదల పార్టీ అని యనమల రామకృష్ణుడు అన్నారు. పేదల కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. 63 ఏళ్ల వయస్సులో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం చంద్రబాబుకే చెల్లిందని టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉక్కు సంకల్పంతో చంద్రబాబు యాత్ర చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు కిరణ్, జగన్, కెసిఆర్‌లను నిలువరించాలంటే టిడిపిని ఆదరించాలని ఆయన అన్నారు.

తెలుగువారి బాగు కోసం రాష్ట్రం రేపటి వెలుగుల కోసం తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర అద్వితీయమని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ యాత్ర చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు, కోడెల శివప్రసాద్ రావు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
Nandamuri hero Balakrishna has supported the Telugudesam party president Nara Chandrababu Naidu at Visakhapatnam public meeting. Chandrababu Naidu said that he will work for the welfare of the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X