చంద్రబాబూ! ఏం మార్చేస్తావో చెప్పు?: శైలజానాథ్

Sailajanath
హైదరాబాద్/చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్ ఆదివారం అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమేనని హామీ ఇచ్చినా తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారమిస్తే అన్ని మార్చేస్తానని చెప్పడంపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వస్తే ఇప్పటి సంక్షేమ పథకాలను చంద్రబాబు రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం బాగానే ఉందని, బాబు వచ్చి కొత్త సమస్యలు తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య విభేదాలు లేవని, ఏమైనా ఉన్నా పరిష్కరించుకుంటారన్నారు.

బొగ్గు కుంభకోణంలో బిజెపికీ భాగస్వామ్యం: ఏచూరి

బొగ్గు కుంభకోణంలో భారతీయ జనతా పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందని సిపిఎం సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి ఆరోపించారు. కాంగ్రెసు, బిజెపిలు ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు రాకుండా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మైనార్టీ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నారు.

ఎన్నికలలో సంస్కరణలు తేవాల్సిన అవసరముందన్నారు. ములాయం సింగ్ యాదవ్, మాయావతిల వల్లే కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం నిలబడిందన్నారు. ఎప్పుడైనా కూలవచ్చన్నారు. 2జి కుంభకోణాన్ని పూర్తిగా రాజా పైకి నెట్టి వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+