హీరో విక్టరీ వెంకటేష్ వంతు: జగన్ పార్టీ ఫ్లెక్సీలో చోటు

Posted By:
Subscribe to Oneindia Telugu
Venkatesh - YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఫ్లెక్సీల జాడ్యం వదలడం లేదు. కృష్ణా జిల్లాలో మరో ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలో ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కనిపించారు. రెండు రోజుల క్రితం వెంకటేష్ నటించిన షాడో చిత్రం విడుదలయిన విషయం తెలిసిందే.

మచిలీపట్నంలో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డిలతో పాటు విక్టరీ వెంకటేష్ ఫోటోలను పొందుపర్చారు. షాడో సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫ్లెక్సీ వెలిసింది. జగన్ పార్టీకి చెందిన వెంకటేష్ అభిమానులు దీనిని ఏర్పాటు చేశారని అంటున్నారు.

వారం రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ప్రిన్ మహేష్ బాబు ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ ఫ్లెక్సీలో పెట్టిన విషయం తెలిసిందే. జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో తమ ఫ్లెక్సీలో మహేష్ బాబును ఉంచారు.

అంతేకాకుండా మూడు రోజుల క్రితం ఫ్లెక్సీల గొడవ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూడా పాకిన విషయం తెలిసిందే. హైదరాబాదు సమీపంలోని బాలాపూర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు, ప్రముఖ టాలీవుడ్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల ఫోటోలను పొందుపర్చారు. ఇది స్థానికంగా కలకలం రేపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party is still using Tollywood Heros pictures in their flexees. Now, Machilipatnamleaders used Hero Venkatesh photos in flexees.
Please Wait while comments are loading...