జగన్‌పై టిడిపి రివర్స్ గేమ్!: షర్మిల యాత్రలో కలకలం

Sharmila - Tummala Nageswara Rao
ఖమ్మం: తమ వర్గానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన శాసన సభ్యులు, నేతలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైండ్ గేమ్ అడుతున్న విషయం తెలిసిందే. తన వైపుకు వచ్చే ఎమ్మెల్యేల రాక విషయంలో జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు జగన్ పార్టీ పైన తెలుగుదేశం అదే అస్త్రాన్ని ప్రయోగించిందట.

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మచ్చా శ్రీనివాస్ తదితరులు వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా కరపత్రాల కలకలం చెలరేగింది. పార్టీలో కీలకంగా ఉన్న జలగం వెంకట్రావును దెబ్బ తీసేందుకు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు వ్యూహాత్మకంగా తనకు అనుకూలురుగా ఉండే మచ్చా, పొంగులేటిలను వైయస్సార్ కాంగ్రెసులోకి పంపించారనే కరపత్రాలు కనిపించాయి. ఇది జిల్లాలో ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

జిల్లాలో జగన్ పార్టీని, జలగంను దెబ్బతీసేందుకే తుమ్మల వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ప్రవేశించారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఆరోపణలను సదరు నేతలు మాత్రం ఖండిస్తున్నారు. తమను ఎదుర్కోలేకే ఇలాంటి చీఫ్ ట్రిక్స్‌కు తెరలేపుతున్నారని, తాము జగన్ నాయకత్వంలోనే పని చేస్తామని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+