మేం చెప్పిందే నిజమైంది: సిబిఐపై అంబటి వ్యాఖ్య

సిబిఐని కాగంర్ెసు పార్టీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో ఇది మరోసారి రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు. బొగ్గు కుంభకోణంలో ప్రధాని కార్యాలయం (పిఎంవో) వ్యవహరించిన తీరుపై ప్రజలంతా సిగ్గుపడుతున్నారని అన్నారు. సిబిఐ దర్యాప్తుపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఆయన అన్నారు. సిబిఐ ఇలాగే వ్యవహరిస్తే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
మహిళలకు మోసం చేస్తున్న కిరణ్ రెడ్డి
బంగారు తల్లి, అమ్మ హస్తం అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహిళనలు మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బంగారు తల్లీ.. బూచోళ్లు వస్తున్నారు అని అంటే సరిపోతుందని ఆణె వ్యాఖ్యానించారు. మహిళలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని పద్మ వ్యాఖ్యానించారు.
బిందెడు నీళ్లు ఇవ్వని ప్రభుత్వానికి బంగారు తల్లి అని పిలిచే అర్హత ఎక్కడిదని ఆమె అడిగారు. బంగారు నాణేలు పంచినా కాంగ్రెసు వైపు మహిళలు చూడరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications