కెసిఆర్ నోటికి మోరీకి తేడా లేదు: జగ్గారెడ్డి నిప్పులు

తెలంగాణ ఆస్తులను కాపాడిన ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఆయన మాటలను నమ్మకుంటే ఎలా అన్నారు. తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బయ్యారం గనులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సోమవారం నాడు మెదక్ జిల్లా సభలో కేవలం జిల్లా గురించి మాట్లాడలేదని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారన్నారు. బయ్యారం ఆస్తులను కాపాడినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. బయ్యారం గనులకు మెదక్‌కు సంబంధం లేదన్నారు.
అలా కాకుండా భూకంపం సృష్టిస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. కెసిఆర్ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లుండి తెలంగాణ బందు ప్రజల కోసం కాదని వారి రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. బందుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. బందును తాము వ్యతిరేకిస్తున్నామని, మెదక్ జిల్లా ప్రజలు సహకరించరన్నారు. బందును సమర్థవతంగా ఎదుర్కోంటామన్నారు. కెసిఆర్ నోటికి, మోరీకి ఏమాత్రం తేడా లేదన్నారు. సిఎల్పీలో వైయస్ ఫోటో తొలగింపుపై చర్చిస్తామన్నారు.












Click it and Unblock the Notifications