వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక పోల్స్: కిరణ్ 'అవినీతి'కి కిషన్ రెడ్డి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

kiran kumar reddy and kishan reddy
బెంగళూరు/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పాలనతో కర్నాటక ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్నాటకలో ఉన్నారు. కర్నాటక ఎన్నికలు వచ్చే లోకసభ ఎన్నికలకు దిక్సూచి వంటివని చెప్పారు. కాంగ్రెసు విజయం తథ్యమన్నారు.

సంకీర్ణ ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే తమ పార్టీకి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారన్నారు. కర్నాటక - ఆంధ్రప్రదేశ్ జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అందరితో చర్చించిన తర్వాత అధిష్టానం ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బిజెపిది అవినీతి పాలన అన్నారు.

కిషన్ రెడ్డి కౌంటర్

కర్నాటకలో బిజెపిది అవినీతిపాలన అని, కర్నాటక అవినీతి మంత్రులు ఎపి జైళ్లలో ఉన్నారన్న కిరణ్ వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ ఎపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాదులో ఘాటుగా స్పందించారు. ఎపిలో తమ అవినీతి కప్పిపుచ్చి బిజెపిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ఇక్కడి మంత్రులు కొందరు జైళ్లలో, మరికొందరు సిబిఐ చక్రబంధంలో ఉన్నారని విమర్శించారు.

వారు అవినీతికూపంలో ఇరుక్కుపోయి తమను విమర్శించడమేమిటన్నారు. కిరణ్‌కు నైతిక హక్కు లేదన్నారు. పొత్తులతో తాము విసిగిపోయామని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించామని, ఆయనే నిర్ణయం తీసువాలన్నారు.

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్వతంత్రంగా ముఖ్యమంత్రి కాలేదన్నారు. బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని ఆయన చెప్పడం సరికాదన్నారు. తమతో పొత్తు పెట్టుకోమని ఆయనకు ఎప్పుడు చెప్పలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి మంత్రుల రాజ్యం నడుస్తుంటే మన సిఎం కర్నాటకలో నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary
BJP state president kishan Reddy has condemned CM Kiran Kumar Reddy's comments on Karnataka BJP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X