కారులో యువతిపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్

గుర్గావ్‌లోని మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యువతి కారు ఎక్కినట్లు సమాచారం. మహిపాల్‌పూర్ - పాల్వాల్ రోడ్డులో నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చిన తర్వాత వారు యువతిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
తనపై జరిగిన అత్యాచారంపై బాధితురాలు మంగళవారం గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
అత్యాచారం చేసిన తర్వాత తనను రోడ్డుపై పడేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి మూడు నెలల బిడ్డ కూడా ఉంది. నిందితుల్లో ఒకరిని దేవేందర్ (29)గా గుర్తించారు. తనను ఇంటి వద్ద దింపుతానని దేవేందర్ కారులో ఎక్కించుకున్నాడని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications