వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాడ 'ట్విస్ట్': కెసిఆర్‌ని తూలనాడి.. కోదండకు ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Chada lashes out at KCR and praises Kodanda
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ రావడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు.

డబ్బులను దండుకోవడమే ఆయన పని అన్నారు. డబ్బు అవసరమైనప్పుడు ఉద్యమం.. లేదంటే ఫామ్ హౌస్‌కు ఆయన పరిమితం అవుతారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారన్నారు.

తనను తెరాస నుండి ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వంటి ఉద్యమకారుడు, నాయకుడి వల్లనే తెలంగాణ సాధ్యమని చాడ సురేష్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కెసిఆర్ తెలంగాణ కోసం ఉద్యమించడం లేదన్నారు.

ఆంతర్యమేమిటో...?

కెసిఆర్, కోదండరామ్‌ల మధ్య గతంలో విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. అయితే, చాడ సురేష్ రెడ్డి ఈ రోజు కెసిఆర్‌ను తూలనాడుతూ.. కోదండ వల్లే తెలంగాణ సాధ్యమని చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇరువురి నేతల మధ్య విభేదాలు మళ్లీ వచ్చాయా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఐకాసను రాజకీయ వేదికగా మార్చమని కోదండ నిన్న చెప్పారు. అయితే, కోదండ లాంటి నాయకుడి వల్లనే తెలంగాణ సాధ్యమని చెప్పడం వెనుక ఆంతర్యమేదో ఉందంటున్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు తెరాస ఎమ్మెల్యేలు

గతంలో న్యూఢిల్లీలోని ఎపి భవనంలో ఉద్యోగిపై దాడి చేసిన కేసులో తెలంగాణ ప్రాంత తెరాస శాసనసభ్యులు కెటి రామారావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎదుట హాజరయ్యారు.

English summary
Former MP Chada Suresh Reddy has lashed out at K Chandrasekhar Rao and praised TJAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X