తేడాల్లేవు: టిజి వెంకటేష్, సిఎం తీసుకోవచ్చు: జెసి

మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారనే విషయం తనకు తెలియనదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, అయితే అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఏదో చేయాలనే కసి ఉందని ఆయన అన్నారు.
ఎస్సీ వర్గీకరణకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి శైలజానాథ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో తాము మరోసారి ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. ఈ నెలలోనే అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తు్న నేతలంతా సంయమనం పాటించాలని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల పార్టీ శ్రేణులు, ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పార్టీలో సమన్వయాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు. బయ్యారం గనులపై కొందర రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications