సిఎం, 150వ సినిమా: చిరుకోసం 25గం. పొర్లుదండాలు

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని బలిజపల్లెకు చెందిన ఇతడు చిరంజీవికి వీరాభిమాని. ఇతని వయస్సు మప్పయ్యేళ్లు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ అలిపిరి నుంచి మెట్లపై పొర్లుతూ తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందాక ఇలాగే తన మొక్కు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని, 150వ సినిమాలో నటించాలని కోరుకుంటూ ముచ్చటగా మూడోసారి మెట్లపై పొర్లుతూ తన మొక్కుకున్నారు.
సుమారు ఇరవై ఐదు గంటల పాటు మెట్లపై పొర్లుతూ శనివారం ఉదయం పది గంటలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని, అఖిలాండం వద్ద కొబ్బరికాయలు సమర్పించారు. చిరంజీవి కోసం అతను ఇప్పటికి మూడుసార్లు శ్రీవారిని మొక్కుకున్నారు.
కాగా, ఇటీవల చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో మద్దతు పెరుగుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నా, బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నా కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాత్రం చిరంజీవి వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరును 2014 ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పర్యాటక శాఖ మంత్రిగా అయిన తర్వాత చిరంజీవి దూకుడు పెంచారు. అందరి మన్ననలను పొంది అధిష్టానం మెప్పు పొందారు. ఇటీవల కర్నాటక ఎన్నికల ప్రచారాంలో ఆయనకు ప్రజలు హారతి పట్టడం చూసిన అధిష్టానం పెద్దలు మరోసారి ఆయనను ప్రచారం కోసం పురమాయించారు.












Click it and Unblock the Notifications