సురేఖ పార్టీలోనే ఉన్నారు, బాబుకు భయం: భూమన

సిబిఐని విమర్శించకపోవడమే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో మిలాఖత్ అయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు గిట్టనివారిపై కాంగ్రెసు సిబిఐని ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు.
సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి లేదని తేటతెల్లమైందని ఆయన అన్నారు. సిబిఐ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తోందని ఆయన విమర్శించారు. సిబిఐ నిర్లజ్జగా ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తొత్తుగా సిబిఐ వ్యవహరిస్తుంటే చంద్రబాబు మాట్లాడడం లేదని ఆయన అన్నారు.
తన అవినీతి బయటపడతుందనే భయంతోనే చంద్రబాబు సిబిఐపై మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను వేధిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications