జడ్జిలతో ఒప్పందమా?: జూపూడికి కెఈ, దాడికి సవాల్

రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి రైల్వే వ్యాగన్ రిపేరు షెడ్డుకు, కోచ్ ఫ్యాక్టరీకి తేడా తెలియకపోవడం దారుణమన్నారు. కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని ఆయన చెబుతున్నారని కానీ, వచ్చింది వ్యాగన్ రిపేర్ షెడ్డు మాత్రమే అన్నారు. దాడి వీరభద్ర రావుకు పదవులు ఇచ్చి ఉన్నత స్థానంలో నిలిపితే ఆయన ఎటు కాకుండా పోయారని ఎద్దేవా చేశారు.
దాడికి అయ్యన్న తనయుడు సవాల్
దాడి వీరభద్ర రావుకు విశాఖ జిల్లా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ సవాల్ విసిరారు. దాడి పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లా టిడిపి నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బండారు, వాసుపల్లి గణేష్, కెఎస్ఎన్ రాజు, మాజీ మంత్రి మణికుమారి, శోభా హైమావతి, తులసి రావు, విజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిపై ఆయన తనయుడు రత్నాకర్ పైన విజయ్ మండిపడ్డారు.
దాడికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుండి పోటీ చేయాలని విజయ్ సవాల్ విసిరారు. దాడి వెంట టిడిపి క్యాడర్ వెళ్లలేదని, ఆ భయంతో ఆయన వేరే నియోజకవర్గం నుండి పోటీ చేయవద్దన్నారు. అనకాపల్లిలో పోటీ చేసి దమ్ము చూపించాలన్నారు. కేవలం దాడి తనయుడు అన్న ఒకే ఒక కారణంతో రత్నాకర్‌ను రూరల్ అధ్యక్షుడిగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేశారన్నారు. దాడి కుటుంబం టిడిపికి మోసం చేసిందన్నారు.












Click it and Unblock the Notifications