దాడి ఎఫెక్ట్: జగన్‌కు కొణతాల బల ప్రదర్శన, కాంగ్రెస్ నో

జిల్లాకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్ర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో కొణతాల అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, అంతకుముందు దాడిని పార్టీలో చేర్చుకుంటే వచ్చే నష్టంపై పార్టీ అధిష్టానానికి మరింత వివరంగా చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే ఆయన రేపు హైదరాబాదులో అధిష్టానం ముందు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. తన వారిని విశాఖ నుండి రప్పించి విజయమ్మను ఒప్పించాలని చూస్తున్నారట. లేదంటే ఆయన రేపు సాయంత్రం లోగా కీలక ప్రకటన చేయనున్నారని అంటున్నారు.
కాగా, కొణతాల మాట్లాడుతూ.. దాడివి దిగజారుడు రాజకీయాలు అని, ఆయనతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని అన్నారు. జగన్‌కు చెప్పాల్సింది చెప్పానని త్వరలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
కాంగ్రెసులోకి కొణతాలకు నో...!
కొణతాల కాంగ్రెసులోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని పలువురు విశాఖ నాయకులు, కార్యకర్తలు మంత్రి గంటా శ్రీనివాస రావును కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కాంగ్రెసు పార్టీలోను చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. మరికొందరు కొణతాల వస్తే పార్టీ బలపడుతుందని చెబుతున్నారట. దీనిపై గంటా మాట్లాడుతూ.. కొణతాల రాకపై తమకు సమాచారం లేదని, వస్తానని చెప్పినప్పుడు ఆలోచిస్తామన్నారు.
జగన్ పార్టీ మండిపాటు
కొణతాల ఎపిసోడ్‌ను మీడియా భూతద్దంలో చూపిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగిరెడ్డి అన్నారు. 2014లో తమదే గెలుపు అన్నారు. టిడిపి, కాంగ్రెసులు ఓటమి చెందడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications