వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు ఇంటికెళ్తే తప్పేంటి?: రఘువీరా, సిఎం స్కీంపై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇంటికి తాను వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. చిరు ఇంటికి వెళ్లినంత మాత్రాన అసంతృప్తి కుంపటి రాజుకున్నట్లా? అని ఆయన అభిప్రాయపడ్డారు. తాను 2014 నాటి ముఖ్యమంత్రి రేసులో లేనని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.

2014 నాటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో నిర్ణయించలేదన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి తమ పార్టీలో లేదని చెప్పారు. అభ్యర్థిని తమ పార్టీ అధిష్టానం, కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు నిర్ణయిస్తున్నారు. మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. తనకు పార్లమెంటుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో అందరం నేతలు కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు. ఎవరికి ఎవరితోను విభేదాలు లేవన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం కలే అన్నారు.

కాంగ్రెసు పార్టీ నేతలు విభేదాలను పక్కన పెట్టి ఐక్యతను చాటాలని శాసనమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెప్పారు.

పథకాల గురించి తెలుసుకుంటా: బొత్స

ఇటీవల బంగారు తల్లి పథకం గురించి తనకు తెలియదని, దాని గురించి తెలుసుకొని మాట్లాడతానని ముఖ్యమంత్రిపై అసంతృప్తి ప్రకటించిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం మరో రకంగా మాట్లాడారు. తమకు పథకాల గురించి తెలియకుంటే తెలుసుకొని మాట్లాడతామని చెప్పారు. కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.

English summary
Minister Raghuveera Reddy questioned that what is wrong if he was went to Central Minister Chiranjeevi's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X