కర్ణాటక ఫలితాలు: యడ్యూరప్ప కొంప ముంచాడు

యడ్యూరప్ప నేతృత్వంలోని కెజిపి 25 నుంచి 30 శానససభా నియోజకవర్గాల్లో తమ పార్టీ దెబ్బ తీసిందని ఆయన అన్నారు. ఉత్తర కర్ణాటకలో కెజిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తాము కొన్ని సీట్లు కోల్పోతామని ఆయన అన్నారు. కెజిపి వల్ల తాము కోల్పోయే సీట్ల గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు.
కెజిపి ప్రభావం తమ పార్టీపై ఏ మాత్రం పడదని బిజెపి నాయకులు అంటూ వచ్చారు. ఆ వాదనకు భిన్నమైన వ్యాఖ్య షెట్టార్ నుంచి వచ్చింది. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదని ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. కాంగ్రెసును నిరోధించడానికి జెడిఎస్‌తో కలిసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తోంది.
నిజానికి 70-80 సీట్లు తమకు వస్తాయని బిజెపి అంచనా వేసింది. అలాంటి సమయంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుందని భావించారు. కానీ, ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి కన్నా జెడిఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీ వందకు పైగా సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. లెక్కింపు పూర్తయ్యే సమయానికి తమకు పూర్తి మెజారిటీ దక్కుతుందని కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications