కర్ణాటక: కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ రాదా?

బిజెపి రెండో స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశం లేదు. కుమారస్వామి నాయకత్వంలోని జెడిఎస్ బిజెపి కన్నా ఎక్కువ ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెసు 106 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి 41 స్థానాల్లో, జెడిఎస్ 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కెజిపి కేవలం 9 స్థానాల్లో ఆధిక్యతలో సాగుతోంది.
గాలి సోదరులకు సన్నిహితుడైన శ్రీరాములు బిఎస్సార్ పార్టీ ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. కేవలం నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బళ్లారిలో కూడా దాని ప్రభావం కనిపించడం లేదు. బళ్లారి జిల్లాలో 9 స్థానాలు ఉంటే, ఏ స్థానంలోనూ బిఎస్సార్ ప్రభావం కనిపించడం లేదు. శ్రీరాములు మాత్రమే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో ఆధిక్యంలో సాగుతున్నారు.
తాము 120 సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తాను పొత్తులకు సిద్ధంగా ఉన్నానని యడ్యూరప్ప ప్రకటించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ హిబ్లీ ధర్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఈశ్వరప్ప మాత్రం వెనుకంజలో ఉన్నారు.












Click it and Unblock the Notifications