Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నాటక ఫలితాలు: టీవీ రిపోర్టర్‌గా మారిన చిద్దూ

Chidambaram and Jaswant Singh
న్యూఢిల్లీ: కర్నాటక శానససభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం టీవీ రిపోర్టర్‌గా మారిపోయారు. ఓ టీవీ రిపోర్టర్ చేతి నుంచి చిదంబరం మైక్ తీసుకుని పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న బిజెపి నేత జస్వంత్ సింగ్ ముందు పెట్టారు.

విజయానికి కాంగ్రెసుకు క్రెడిట్ ఇవ్వారా అని చిదంబరం జస్వంత్ సింగ్ అడిగారు. నిజానికి, జస్వంత్ సింగ్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కర్ణాటక ఫలితాలపై ప్రతిస్పందనను అడగాలని అనుకున్నారు. వెంటనే చిదంబరం ఓ టీవీ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని జస్వంత్ సింగ్‌కు ప్రశ్నలు వేశారు.

మైక్‌ను టీవీ రిపోర్టర్‌కు తిరిగి ఇస్తూ జస్వంత్ సింగ్ జెంటిల్‌మన్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలు రాజకీయ పార్టీలకు హెచ్చరిక అని, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఫలితాలు చూపించాల్సిందేనని చిదంబరం అన్నారు.

చిదంబరం వ్యాఖ్యతో జస్వంత్ సింగ్ ఏకీభవిస్తూ పరిపాలనకు ప్రజలు ఓటేస్తారని, పాలన స్తంభిస్తే ప్రజలు ఓడిస్తారని అన్నారు. జస్వంత్ సింగ్ బిజెపిలో సీనియర్ నేత అనే విషయం తెలిసిందే. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+