కర్ణాటక: ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే

పలువురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ, కర్నాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గేలతో పాటు మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా ఉన్నారు. వీరిలో సిద్ధరామయ్య విజయం సాధించారు.
శానససభ ఎన్నికలకు ఎస్ఎం కృష్ణ, వీరప్ప మొయిలీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే, ఎస్ఎం కృష్ణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఎస్ఎం కృష్ణ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాము 120 స్థానాలు గెలుస్తామని పరమేశ్వర అంటున్నారు. బిజెపి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓటమి పాలయ్యారు.
తమ పార్టీ విజయపథాన సాగుతుండడంతో కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెసు కార్యాలయాల వద్ద కాంగ్రెసు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయం వద్ద కూడా సంబరాలు జరుగతున్నాయి. కాంగ్రెసు నాయకులు ఆనందసముద్రంలో మునిగి తేలుతున్నారు.












Click it and Unblock the Notifications