మీడియాపై కుమార అసహనం, భార్య గెలుపుపై ధీమా

తమకు ఎవరి నుండి ఎలాంటి సహకారం లేకున్నా, డబ్బు లేకున్నా యాభై సీట్ల వరకు గెలుచుకుంటామన్నారు. ఫలితాలపై తానేమీ నిరాశ చెందడం లేదన్నారు. పర్జల తీర్పును గౌరవిస్తామన్నారు. తన భార్య అనిత వెనుకంజలో ఉన్నప్పటికీ గెలుస్తుందన్నారు.
తాము ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. తానేమీ కింగ్ మేకర్‌ని కాదని మొదటి రోజే చెప్పానన్నారు. రాజు ఎవరవుతారో, రాజును చేసే వారు ఎవరవుతారో తనకు తెలియదన్నారు. మొదటి నుండి తమకు మీడియా సహకరించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెసు గెలుస్తుందనే అభిప్రాయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది: ఖర్గే
ముఖ్యమంత్రి తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అధిష్టానం సూచనల మేరకే తాము నడుచుకుంటామన్నారు.
ఓట్ల చీలిక వల్లే: రవిశంకర ప్రసాద్
కర్నాటకలో బిఎస్సార్ కాంగ్రెసు, కెజెపి పార్టీలు బిజెపి ఓట్లను చీల్చాయని అందుకే ఓటమి చెందామని బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర ప్రసాద్ అన్నారు. తమ పార్టీ నుండి వెళ్లి వారు రాజకీయా పార్టీలు నెలకొల్పడం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నారు. కర్నాటక ఫలితాలతో మురిసిపోతున్న కాంగ్రెసు దమ్ముంటే ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని వెంకయ్య నాయుడు సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications