కౌంటర్‌గా సాంబయ్య: కడియంపై టిడిపి నేతల ఫైర్

కాగా, పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. కడియం శ్రీహరి రాజీనామా ఊహించిందేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కడియం శ్రీహరి వెళ్లిపోవడం వల్ల తమ పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే కడియం శ్రీహరి పార్టీని వీడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
పక్కా తెలంగాణవాదిని అని చెప్పుకునే కడియం శ్రీహరి లేఖలో ఏమీ లేకపోతే అఖిలపక్ష సమావేశానికి ఎందుకు వెళ్లారని ఆయన అడిగారు. మోత్కుపల్లి నర్సింహులుతో ఏర్పడిన వివాదం కారణంగానే కడియం శ్రీహరి తీవ్ర మనస్తాపానికి గురై చంద్రబాబుపై అలక వహించారు. అప్పటి నుంచే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.
కడియం శ్రీహరి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఖండించారు. తెలంగాణకు కాంగ్రెసు ద్రోహం చేసిందని చెబుతూ వచ్చిన కడియం శ్రీహరి ఇప్పుడు తమ పార్టీని నిందించడం తగదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తెలుగుదేశం పార్టీని కడియం శ్రీహరి ఎందుకు వీడారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణపై లేఖ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యతిరేకమని కడియం శ్రీహరి గతంలో చెప్పారని, అటువంటి పార్టీలో కడియం శ్రీహరి ఎలా చేరుతారని ఆయన అన్నారు. కెసిఆర్‌లో ఏం మార్పు వచ్చిందని తెరాసలో చేరుతున్నారని అడిగారు. స్వప్రయోజనం కోసం, రాజకీయ లబ్ధి కోసమే కడియం శ్రీహరి టిడిపిని వీడారని ఆయన అన్నారు.
కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేయడంపై వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి తప్పు పట్టారు. పదవులు అనుభవించి పార్టీని వీడడం దివాళాకోరుతనమని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థంతోనే పార్టీకి కడియం రాజీనామా చేశారని ఆయన అన్నారు. జన్మ ఇచ్చిన పార్టీని, పార్టీ అధినేతను కడియం శ్రీహరి విమర్శించడం సరైంది కాదని ఆయన అన్నారు.
కడియం శ్రీహరిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెరాస శాసనసభ్యుడు రాజయ్య చెప్పారు. తెరాస మరో శానససభ్యుడు వినయ్ భాస్కర్ కూడా శ్రీహరిని తమ పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications