సస్పెన్స్: కొణతాలకు పురంధేశ్వరి ఒకే, చెప్తేనే అని గంటా

Konathala Ramakrishna
హైదరాబాద్: దాడి వీరభద్ర రావు రాకతో పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కాంగ్రెసు పార్టీలో చేరిక ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఆయన రాకకు స్థానిక కాంగ్రెసు నేతలు మద్దతు పలుకుతుండగా.. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు, కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆయన రాకను ఆహ్వానిస్తున్నారు. అయితే, ఆయన చేరికపై మాత్రం సందిగ్ధం ఇంకా వీడలేదు.

ఆయన పార్టీలోనే ఉంటారా? లేక కాంగ్రెసులో చేరుతారా? అనే చర్చ సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతగా తొలిసారిగా అనకాపల్లికి వచ్చిన దాడి పర్యటనను కొణతాల వర్గీయులు బహిష్కరించారు. దీంతో కొణతాల ఏం చేస్తారోనని జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పురందేశ్వరి కూడా కొణతాల కాంగ్రెస్‌లోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాస రావు అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.

ఇప్పటికే ఈ విషయమై గంటాతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంప్రదింపులు జరిపారు. కొణతాల మళ్లీ కాంగ్రెస్ గూటిలోకి వస్తే అభ్యంతరాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి గంటా.. కొణతాల కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకుడే కాబట్టి వెనక్కి రావడంలో అభ్యంతరం ఏముంటుందన్నారు. అయితే దీనిపై తన కార్యకర్తల అభిప్రాయాలను తెలుకోవాల్సి ఉందని వివరించారు. జగన్ పార్టీని వీడుతున్నానన్న సంకేతాలను కొణతాల స్పష్టంగా పంపితే తన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని గంటా స్పష్టం చేస్తున్నారు.

పార్టీ ముఖ్యనేతలు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. పార్టీలు మారేటప్పుడు బాహాటంగా చెప్పాలనడం సరికాదని, ఇలాంటివన్నీ చివరి నిమిషం వరకూ రహస్యంగా ఉంచాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కొత్తగా చేరాల్సిన పార్టీ నాయకత్వానికీ, చేరేందుకు ముందుకు వచ్చిన వారికీ మధ్య స్పష్టమైన అంగీకారం కుదిరేంతవరకూ ఇది అంతర్గత వ్యవహారంగానే ఉంటుందని వారు చెబుతున్నారు.

అయితే జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ తిరస్కరించిన రోజున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో మీడియాతో కొణతాల మాట్లాడడాన్ని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ రోజు కొణతాల మీడియాతో మాట్లాడకుంటే బాగుండేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+