నవాజ్‌షరీఫ్ విజయం: భారత్ హర్షం, ఒమర్ ఆశాభావం

నవాజ్ షరీఫ్ అధికారంలోకి వస్తే 1999లో అర్ధాంతరంగా ఆగిపోయిన భారత్ - పాకిస్థాన్ శాంతిప్రక్రియ చర్చలు పునఃప్రారంభించడం ద్వారా ఆయన తన నిబద్ధతను రుజువు చేసుకుంటారని తాను ఆశిస్తున్నానని ఒమర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుపై భారత్ హర్షం వ్యక్తం చేసింది.
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లో సుస్థిర పాలన కొనసాగాలని భారతీయ జనతాపార్టీ ఆకాంక్షించింది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటవుతుండటం సంతోషించదగ్గ పరిణామం అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. భారత్ - పాక్ సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని కావడం భారత దేశానికి అనుకూలమేనని పలువురు రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. గతంలో భారత్‌తో శాంతి చర్చలకు తెరలేపారని, ఇప్పుడు ఆయన ప్రధాని అయితే మరోసారి అందుకు ఆయన సిద్ధంగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
భారత్ - పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మరింత మెరుగు పడేందుకు నవాజ్ షరీఫ్ గెలుపు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాగా, నిన్న జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పార్టీ 126 స్థానాల్లో, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఐ ఇన్సాఫ్ పార్టీ 37 సీట్లను స్థాపించి ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది. అధికార పిపిపి ఘోర పరాజయం పాలైంది.












Click it and Unblock the Notifications