బాబు ఫిర్యాదు: గవర్నర్ నమస్కారం పెట్టి నవ్వారు

Chandrababu Naidu - Narasimhan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చిక్కుకున్న రాష్ట్ర మంత్రులపై గవర్నర్ నరసింహన్‌కు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రాజభవన్‌లో కలిసి ఫిర్యాదు చేసినప్పుడు గవర్నర్ నమస్కారం పెట్టి నవ్వారని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చెప్పారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరితే గవర్నర్ మౌనంగా విని ఊరుకున్నారని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

గవర్నర్‌తో భేటీ తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కళంకిత మంత్రుల పట్ల గవర్నర్ నరసింహన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు కొనసాగడానికి అనర్హులని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతటితో వదలబోమని, మంత్రులను తప్పించేంత వరకు ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు.

కళంకిత మంత్రులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో పేర్లున్న మంత్రులు కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. తీవ్రవాద సమస్య కన్నా అవినీతి ప్రమాదకరమైందని ఆయన వ్యాఖ్యానించారు. కళంకిత మంత్రులను తొలగించాలని గవర్నర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించాలని, ముఖ్యమంత్రి తొలగించకపోతే గవర్నర్ వారిని డిస్మిస్ చేయాలని చంద్రబాబు అన్నారు.

జలయజ్ఞం, గనులు, సెజ్‌ల కేటాయింపుల్లో అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఆరుగురు మంత్రులపై ఆరోపణలు వచ్చాయని, ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న హోం మంత్రి సబితా ఇద్రారెడ్డి పదవిలో కొనసాగడాన్ని, ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+