మీటింగ్‌కు కొణతాల డుమ్మా: ధిక్కార ఎమ్మెల్యేల ఫ్యాక్స్

దాడి వీరభద్ర రావు రాకతో అసంతృప్తితో ఉన్న కొణతాల రామకృష్ణతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే వారు హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణలో పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పర్యటన తదితర అంశాలతో పాటు స్పీకర్ నోటీసులపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం.
ధిక్కార ఎమ్మెల్యేలు ఫ్యాక్స్
అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తొమ్మిది మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు.
ఈ రోజు కాంగ్రెసు, రేపు టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. అయితే, తమపై వేటు వేయడం లేదా రాజీనామాలు ఆమోదించడం ఏదైనా చేయాలని తాము ఇప్పటికే స్పీకర్‌ను కోరామని, కాబట్టి ఈసారి నేరుగా హాజరుకాకుండా ఫ్యాక్స్ ద్వారా వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. పేర్ని నాని, ఆళ్ల నానిలు ఇప్పటికే ఫ్యాక్స్ పంపించారని సమాచారం. ధిక్కార ఎమ్మెల్యేల వివరణ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పీకర్‌ను కలిశారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications