ఆర్మూర్ టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి: కెసిఆర్ ప్రకటన

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఆర్మూర్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
ముఖ్యమంత్రి రైతు సదస్సు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పారు. మాది రైతు ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.
మొదటిసారి రైతు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే హక్కు కాంగ్రెసుకు మాత్రమే ఉందన్నారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయానికి రూ.5,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వానిదన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా రూ.72వేల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications