విదేశీ బ్యాంకుల్లో సోనియా, వైయస్‌కు బ్లాక్‌మనీ: స్వామి

Subramanian Swamy
విజయవాడ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిలు విదేశాల్లోని రహస్య బ్యాంకులలో ధనాన్ని దాచారని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ నిర్వహించిన ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు.

దేశంలో అవినీతి అంతకంతకు పెరిగిపోతోందన్నారు. మతమార్పిడులు నిత్యకృత్యమయ్యాయని, రోజుకో కుంభకోణం బయటపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పిటికే రూ.70 లక్షళ కోట్ల నల్ల ధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోందన్నారు. దానిని వెనక్కి తీసుకు వస్తే సుమారు 14 ఏళ్ల పాటు ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. సోనియా లక్ష కోట్లు, వైయస్ రూ.78 వేల కోట్లు విదేశాల్లోని బ్యాంకుల్లో దాచారని ఆరోపించారు.

మంత్రివర్గంలో స్థానం లభించాలన్నా, ప్రభుత్వ శాఖల్లో మంచి ఉద్యోగం పొందాలన్నా డబ్బుతో ముడిపడి ఉందన్నారు. సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు డిగ్రీ చదువలేదన్నారు. రాహుల్ ప్రధాని కాకుండా అడ్డుకునే వారిలో తాను ముందుంటానని చెప్పారు. గతంలో సోనియాను కూడా అడ్డుకున్నది తానే అన్నారు. సోనియాకు డిగ్రీ లేకున్నా ఆంగ్లంలో డిగ్రీ చేసినట్లు సోనియా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారని విమర్శించారు. తాను ఆరా తీస్తే ఆమె అక్కడ చదువలేదని తెలిసిందన్నారు.

యూపిఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, వారు దేశాన్ని వేలానికి పెట్టారని ఆరోపించారు. ఇంతగా అవినీతి జరుగుతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైలెంట్‌లో పెట్టిన మొబైల్ ఫోన్‌లా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో మంత్రి పదవుల నుంచి, న్యాయమూర్తుల వరకు వేలంలోనే దొరుకుతున్నాయన్నారు. పంజరంలో చిలుకలా ఉన్నారని సిబిఐని ఉద్దేశించి సుప్రీం చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇటలీ పౌరసత్వం ఉన్న రాహుల్‌కు ఎంపీ కావడానికే అర్హత లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+