కాంట్రాక్ట్ న్యూస్ రీడర్‌కు లైంగిక వేధింపులు, కేసు

అంతేకాకుండా తాను శాశ్వత ఉద్యోగిని అని ఆమెను బెదిరించే ప్రయత్నాలు చేశాడు. విధి నిర్వహణలో కూడా వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధింపులు ఎక్కువవుతుండటంతో విధులకు కూడా వెళ్లాలంటే ఆందోళన కలుగుతోందని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో దారుణం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం తూర్పు మొగశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. 52 ఏళ్ల వ్యక్తి వారం రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని తూర్పుమొగశాలకు చెందిన బాలిక(10)కి మంగళవారం ఉదయం తీవ్ర జ్వరం సోకింది. బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురైన ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
పరీక్షించిన వైద్యుల బాలిక అత్యాచారానికి గురైన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు బాలికను విచారించారు. పక్కింట్లో ఉన్న వివాహితుడు గోవింద్ వారం రోజులుగా తినుబండారాల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాలిక తెలిపింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications