లగడపాటికి చేదు అనుభవం: గాయపడిన గన్‌మన్

అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి లగడపాటి రాజగోపాల్ బుధవారం తిరువూరు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముష్టికుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలతో పాటు గ్రామస్థులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
గ్రామస్థులకు, రాజగోపాల్ అనుచరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో లగడపాటి గన్‌మన్ గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications