చిరంజీవిపై తగ్గని కోపం: జీవిత, రాజశేఖర్ కామెంట్స్

Rajasekhar and Jeevitha
తిరుపతి/హైదరాబాద్: కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత దంపతులకు ఆగ్రహం తగ్గినట్లు లేదు. వారు గురువారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని వెనకేసుకొస్తూనే చిరంజీవిపై వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిరంజీవిని కాంగ్రెసు పార్టీ నడిపిస్తోందని వారన్నారు.

కాంగ్రెసు విధానాలకు అనుగుణంగా చిరంజీవి నడుస్తున్నారని వారు చెప్పారు. అప్పట్లో సొంత పార్టీ పెట్టారు కాబట్టి చిరంజీవిపై మాట్లాడామని, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని వారన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది కాంగ్రెసు పార్టీయేనని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు బలమైన పార్టీ అని అన్నారు. చిరంజీవి రక్తనిధిపై గతంలో జీవిత, రాజశేఖర్ దంపతులు తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కొత్తవారికి ప్రాధాన్యం: చంద్రబాబు

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడారు. రాజకీయాల్లో తెరపైకి కొత్త ముఖాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ 20 శాతం కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని ఆయన అన్నారు. సీనియర్లు పార్టీ కోసం పనిచేయాలని ఆయన చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన అన్నారు.

ఒక్క నాయకుడు పార్టీ నుంచి వెళ్లిపోతే 50 మందిని తయారు చేస్తానని ఆయన అన్నారు. అనకాపల్లికి చెందిన దాడి వీరభద్రరావు పార్టీని వీడినా పార్టీతోనే ఉన్న కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి కార్యకర్తలకు, నాయకులకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+