కె కేశవరావు కూల్!: సోనియాతో భేటీ, తెలంగాణపై చర్చ

తెలంగాణ కోసం ఆయన అధిష్టానానికి పలుమార్లు అల్టిమేటం జారీ చేశారు. అలాంటి కెకే ఇప్పుడు సోనియాను కలవటం చర్చనీయాంశమైంది. తెలంగాణపై తాను ఏమి మాట్లాడాలో అదే మాట్లాడానని ఆయన సమావేశం అనంతరం చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి మార్పులపై తాను చర్చించలేదని చెప్పారు.
తన వ్యక్తిగత విషయాలను కూడా అధినేత్రి వద్ద చర్చించినట్లుగా చెప్పారు. సోనియాతో చర్చలు సంతృప్తికరంగా సాగాయని, కేంద్రం తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని కేశవ రావు ఈ సందర్భంగా చెప్పారు.
ఆజాద్‌తో కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై ఆజాద్‌కు కిరణ్ తెలిపారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. కిరణ్, బొత్సలు ఢిల్లీలో కళంకిత మంత్రుల కొనసాగింపు, ఉద్వాసనల పైన కూడా చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications