ఆటో డ్రైవర్ భార్యను నిర్బంధించిన ఫైనాన్షియర్

Auto Driver
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలోని ఒంగోలుతో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఓ ఫైనాన్షియర్ వద్ద అప్పు తీసుకున్నాడు. తిరిగి అప్పు తీర్చలేకపోవడంతో ఫైనాన్షియర్ నుంచి ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ భార్యను ఫైనాన్షియర్ నిర్బంధించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమెను విడిపించి, కేసు నమోదు చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు ముక్కలుగా కోసి దారుణంగా హత్య చేశారు. మృతురాలిని గుర్తించాల్సి ఉంది. పోలీసులు హత్య మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వరుడు మూడో వేయలేదు..

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లా మణగూరు మండలం కొడిసెలకుంటలో పెళ్లిలో చేటు చేసుకున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో పెళ్లికుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 20 వేల రూపాయల కట్నం వద్ద ఇరు వర్గాలకు మధ్య గొడవ ప్రారంభమైంది

కొడిసెలకుంటకు చెందిన వరుడు, వరంగల్ జిల్లాకు చెందిన పెళ్లికూతురుకు మధ్య పెళ్లి మధ్యలో ఆగిపోయింది. లక్షా 60వేల కట్నం మాట్లాడుకున్న అమ్మాయి వాళ్లు మరో 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దాంతో పెళ్లి కొడుకు అమ్మాయి మెడలో తాళి రెండు ముళ్లు వేసి, మూడో వేయకుండా మధ్యలో ఆపేశాడు. దీంతో పెళ్లి మధ్యలో ఆగిపోయింది.

రేపే ఇస్తామని చెప్పినా వరుడికి సంబంధించినవాళ్లు చెప్పినా వినలేదు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెళ్లి కూతురుకు చెందినవారు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల వారు మణుగూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఘర్షణలో పెళ్లి కొడుకు సహా ఐదుగురు గాయపడ్డారు. వారిని మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+