వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే బయటపెట్టు: రఘునందన్‌కు హరీష్ సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తనపై తీవ్ర ఆరోపణలు చేసిన రఘునందన్ రావుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విరుచుకుపడ్డారు. పద్మాలయ స్టూడియోకు సంబంధించిన తాను 80 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు రఘునందన్ చేసిన ఆరోపణలను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.

తనపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, సిడిలను బయట పెట్టాలని ఆయన సవాల్ చేశారు. వాటిని బయటపెట్టకపోతే తాను రఘనందన్ రావుపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు. హరీష్ రావుపై రఘునందన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రఘునందన్ రావును పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా దేవరకొండకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే లంబాడి తండాలను పంచాయతీలుగా మారుస్తామని, రాజకీయాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెసు నేత లక్ష్మిలాలూ నాయక్ కెసిఆర్ సమక్షంలో శుక్రవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితనే తెలంగాణకు నీళ్లు వస్తాయని ఆయన చెప్పారుయ తెలంగాణ ఏర్పడితే ఎక్కువ లాభపడేది లంబాడీలేనని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే బలహీనవర్గాలకు ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ఆయన చెప్పారు.

English summary

 The Telangana Rastra Samithi (TRS) has challenged Raghunandan Rao to reveal evidences to proove allegations against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X