వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ని వీడేందుకు నేను సిద్ధం: కోమటిరెడ్డి అల్టిమేటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Rajagopal Reddy
హైదరాబాద్: కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే తాను ఆ పార్టీలోకి వెళతానని నల్గొండ జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం అన్నారు. ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. గతంలో తెలంగాణ కోసం ప్రగల్భాలు పలికిన నాయకులు ప్రభుత్వం వెనుకంజ వేస్తే పట్టించుకోవడం లేదని అన్నారు. తాను మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ వస్తేనే.. కెసిఆర్

తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరతాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లాలో అన్నారు. జిల్లాలోని హుజూరాబాద్ నియోజక వర్గం జమ్మికుంటలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి శిక్షణా తరగతులను గురువారం కెసిఆర్ ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చేది ఎన్నికల సమయమని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రఘునందన్ వ్యాఖ్యలు సుమోటోగా తీసుకోవాలి: సమైక్యాంధ్ర జెఏసి

మెదక్ జిల్లా తెరాస పార్టీ మాజీ అధ్యక్షుడు రఘునందన్.. కెసిఆర్, కుటుంబంపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి, జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేయించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి డిమాండ్ చేసింది. రఘునందన్ చేసిన వ్యాఖ్యలు వేర్పాటు వాద ఉద్యమ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందన్నారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం, పెట్టుబడి దారీ ఉద్యమం అని చెప్పిన వారే, ప్రస్తుతం తెరాస పార్టీ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్లు ఆరోపిస్తున్నారన్నారు.

కెసిఆర్, వారి కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నైతిక విలువలు మిగిలి ఉంటే వారంతట వారు తమపై సిబి ఐ విచారణకు ప్రభుత్వాన్ని కోరాలన్నారు. ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఢీల్లి కాంగ్రెస్ నాయకుల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను, తెలంగాణాలో విద్యార్థుల బలిదానాలకు కారణం కెసిఆర్ కుటుంబాన్ని పరిగణిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెరాస పార్టీ, కెసిఆర్ కుటుంబంపై సెక్షన్ 306 క్రింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Former Minister Komatireddy Venkat Reddy said on Thursday that he is ready to quit Congress f does not grant Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X