నా మార్పు పుకార్లే: బొత్స, మీడియాపై రుసరుసలు

Botsa Satyanarayana
విశాఖపట్నం: పిసిసి అధ్యక్షుడిగా తనను మారుస్తారనే ప్రచారం ఊహాగానం మాత్రమేనని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడిని మారుస్తారానే ప్రచారం జరుగుతోంది కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరి ఊహాగానాలు వారివని అన్నారు.

ఎవరికి నచ్చినచ్చినట్టు వారు కథనాలు రాస్తున్నారని ఆయన రుసరుసలాడారు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు పిసిసి అధ్యక్షుడిని మార్చే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా? అని ప్రశ్నించగా, పిసిసి అధ్యక్షుని మార్పు తప్పనిసరి కాదని బొత్స అన్నారు. ఢిల్లీ పర్యటన విశేషాలేమిటని ప్రశ్నించగా, సోనియాతో మాట్లాడినవన్నీ బయటకు చెప్పాలా? అని ఎదురు ప్రశ్న వేశారు.

కళంకిత మంత్రులను తొలగిస్తారా? అని అడిగితే అంత గ్రాంధిక పదాలను వాడద్దని బొత్స మీడియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు. మండల, బ్లాక్ కాంగ్రెస్, వార్డు, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో 22న హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా విద్యార్థులకు బస్ పాస్‌ల రాయితీని ఎత్తివేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగితే, దీనిపై కసరత్తు జరుపుతున్నామని, విద్యార్థులకు అన్యాయం జరగదని బొత్స సమాధానమిచ్చారు. బొత్సను విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మశ్రీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, ఎమ్మెల్యేలు కన్నబాబు, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+